నా లోని ఏకాంతన్నికి చెప్పలి. నేను ఎవరో, ఆ ఏకాంతన్నికి తేలియాలి, తాను ఎవరో .
ప్రతి క్షణం ప్రయాణపు నూతన అనుభూతే, ఇది ఆకాశ ప్రయాణం, అజ్ఞానపు చీకట్లను ఎదుర్కొంటు ప్రయాణిస్తున్న మండుతున్న అగ్నిజ్వాల యొక్క ప్రయాణం. ప్రతిక్షణం ప్రయాణంలో ఒక భాగమే, ప్రయాణం ఒక దాని చేరాలని, దాని అందుకోవాలని, పొందాలని సాగే ప్రయాణం , ప్రయాణం తిరగి రాని క్షణాలతో, ఒక ఆలోచనతో ఉనప్పుడు నా ప్రయాణం ఎట్టిది?, ఆకలితో ఉన్నపుడు నా ప్రయాణం ఎట్టిది?,అహంతో ఉనప్పుడు నా ప్రయాణం ఎట్టిది?, కోరికతో ఉనప్పుడు నా ప్రయాణం ఎట్టిది?, చూసే చూపులో ఉనప్పుడు నా ప్రయాణం ఎట్టిది?, శ్వాసలో ఉనప్పుడు నా ప్రయాణం ఎట్టిది?.

No comments:
Post a Comment